'ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలి'
NTR: తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో నమోదు పెంచాలని, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఎండల నేపథ్యంలో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో తెలిపారు.