VIDEO: '2027 నాటికి కుష్టు వ్యాధి రహిత రాష్ట్రంగా మారుస్తాం'
మంచిర్యాల జిల్లాలో 87 మంది కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు తెలిపారు. మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2027 నాటికి కుష్టు వ్యాధి రహిత రాష్ట్రంగా ముందుకెళ్తున్నామన్నారు.