డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే
KMR: ఏఐసీసీ పరిశీలకునిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో పర్యటించారు. 'సంఘటన్ సృజన్ అభియాన్'లో భాగంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. పారదర్శకంగా, కార్యకర్తల అభిప్రాయాల మేరకు అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ప్రణితి షిండే పాల్గొన్నారు.