VIDEO: మహిళా దినోత్సవం సందర్భంగా భారీ మానవహారం
WGL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట పట్టణంలో అంబేడ్కర్ సెంటర్‌లో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మహిళలు భారీ మానవహారం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.