VIDEO: ప్రారంభానికి నోచుకోని వెజిటేబుల్ మార్కెట్
BHPL: మున్సిపాలిటీలో 2022 మార్చిలో రూ.4.50 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ అసంపూర్తిగా పడి నిరుపయోగంగా మారింది. అప్పటి MLA TPS నిధులతో ప్రారంభమైన నిర్మాణం పూర్తి కాలేదు. హంగులతో కూడిన ఈ మార్కెట్ ప్రారంభం కాకుండానే పాడుబడుతోంది. ప్రస్తుత ప్రజా పాలనలోనూ దీనిపై ఎవరూ దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.