మహంకాళి జాతరలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ASF: రెబ్బెన మండలం ఇందిరా నగర్‌లోని స్వయంభూ శ్రీ కనకదుర్గా దేవి శ్రీ మహంకాళి దేవస్థానంలో మహంకాళి జాతర ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో MLA కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి.