పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే బూర్ల
GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతల శిక్షణా తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ కుటుంబ సభ్యులకు ఆయన పలు కీలక సలహాలు, సూచనలు చేశారు.