VIDEO: నెలకొరిగిన శతాబ్దాల నాటి రావి వృక్షం
కోనసీమ: మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమ అంతటా తీవ్రమైన గాలులు, వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తపేట మండలంలోని పలివెల గ్రామ పరిధిలోని కోటమెరకలో శతాబ్దాల నాటి మహా రావి వృక్షం బలమైన గాలులకు తట్టుకోలేక వేళ్లతో సహా పూర్తిగా నేలకొరిగింది. తుఫాను వేగం పెరిగిన సమయంలో జరిగిన ఈ ఘటన గ్రామస్థుల్లో ఆందోళన కలిగించింది.