VIDEO: శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సూర్యకాంత్
TPT: తిరుమలకు విచ్చేసిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.