ప్రపంచానికే ఇది పరీక్షా సమయం: భారత్
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి కేవలం భారత్‌కే కాకుండా.. యావత్ ప్రపంచానికే ఒక పరీక్షా సమయమని భారత విదేశాంగశాఖ పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు నెరవేరేలా చూసుకునేందుకు.. సంబంధిత దేశాలతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. గ్యాస్ కొరత నేపథ్యంలో వినియోగదారులకు అధిక మొత్తంలో బొగ్గును పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.