'వ్యవసాయ మార్కెట్ హమాలీల సమస్యలు పరిష్కరించాలి'
MHBD: వ్యవసాయ మార్కెట్‌లో హమాలీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని మార్కెట్ కార్యదర్శి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. హమాలీలు పనిచేసే చోట త్రాగునీరు, ఎండ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పడిపోకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని అన్నారు.