VIDEO: ప్రశంసా పత్రాలు అందజేసిన జేసీ
VZM: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన 13 మంది విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో మెడల్స్, ప్రశంసాపత్రాలను బుధవారం అందజేశారు. అనంతరం వారి ప్రతిభను కొనియాడారు.