విజయనగరంలో బీజేపీ సంబరాలు

విజయనగరంలో బీజేపీ సంబరాలు

VZM: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ శుక్రవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంపై బీహార్ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలన్నారు. అనంతరం కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు.