శ్రీశైలం మల్లన్న సన్నిధికి పోటెత్తిన శివ స్వాములు
నంద్యాల: 'ఓం నమశ్శివాయ' మంత్రంతో శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రం మార్మోగుతోంది. కార్తీక మాసం సందర్భంగా శివదీక్ష స్వీకరించిన శివ స్వాములు దీక్ష విరమణ చేసేందుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం. శ్రీనివాసరావు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.