బదినేహాల్ వాసికి కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్
KRNL: కౌతాళం మండలం బదినేహాల్‌కి చెందిన బోయ బజారి కుమారుడు, కెమిస్ట్రీ లెక్చరర్ పంపాపతి మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. డా కె.ఎస్.అనంతరాజు పర్యవేక్షణలో కెమిస్ట్రీ విభాగంలో ఆయన పరిశోధన పూర్తి చేశారు. గ్రామ పెద్దలు విశ్వనాథ్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, కుబేర్ రెడ్డి, వీరభద్రా గౌడ్ సహా అధ్యాపకులు పంపాపతిని అభినందించారు.