VIDEO: 'పంట చేను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి'

MLG: వెంకటాపూర్ మండలం లింగాపూర్ గ్రామ శివారులో ఇవాళ పంటచేను ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. 6 ఎకరాల మొక్కజొన్నచేను కొంతమంది వ్యక్తులు నాశనం చేశారు. జంగాలపల్లి గ్రామానికి చెందిన తైలం గౌతమ్ సాగర్ భూమిని ధరమ్ సోత్ దేవేందర్ దంపతులు కౌలు తీసుకుని సాగు చేస్తున్నారు. కాగా, తైలం గౌతమ్ సాగర్, మచ్చపూర్‌కు చెందిన కొంతమంది వ్యక్తుల మధ్య భూవివాదం కొనసాగుతున్నట్లు సమాచారం.