'విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి'
ప్రకాశం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కనిగిరిలోని శాఖ గ్రంథాలయ శనివారం విద్యార్థుల కోసం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఈవో నారాయణరెడ్డి మాట్లాడుతూ... కొన్ని వేల పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెంపొందుతుందన్నారు.