'కోతులతో పంటలకు తీవ్ర నష్టం'

'కోతులతో పంటలకు తీవ్ర నష్టం'

అనకాపల్లి జిల్లాలో కోతులతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతి సచివాలయంలో సీఎం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 12 మండలాల్లో కోతులు బెడద అధికంగా ఉందన్నారు. స్పందించిన సీఎం ఇకపై పంట నష్టం జరగకుండా అటవీ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.