ప్రొద్దుటూరులో అనాధ శవానికి అంత్యక్రియలు

ప్రొద్దుటూరులో అనాధ శవానికి అంత్యక్రియలు

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలిసిన వ్యక్తి మృతి చెందగా, ఆయన బంధువులు ముందుకు రాకపోవడంతో పోలీస్‌లు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఫౌండేషన్ వెంటనే స్పందించి బుధవారం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఫౌండేషన్ ఛైర్మన్ మోరే లక్ష్మణరావు, ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.