పార్వతీపురం: 'సాగ్ పక్కాగా అమలు కావాలి'

మన్యం: జిల్లాలో కౌమార బాలికల పథకం( సాగ్ )ను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఐటీడీఏ పీఓ, డీఎస్ఓ, ఐసీడీఎస్ పీఓ, సీడీపీఓలు, ఎంపీడీఓలు, సూపర్ వైజర్లతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగ్ అనేది 11 నుంచి 14 ఏళ్ల వయస్సు గల కౌమార బాలికలను లక్ష్యంగా చేసుకునే కేంద్ర ప్రాయోజిత పథకమని పేర్కొన్నారు.