ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ విగ్రహాలకు ముసుగులు

కోనసీమ: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు అమలాపురం రూరల్ మండలంలో ఎన్నికలను ప్రవర్తన నియమావళిని అధికారులు అమలు చేస్తున్నారు. శనివారం రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్న నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. గ్రామంలో పలు విగ్రహాలకు పంచాయతీ సిబ్బంది ముసుగులు వేశారు.