రేపు 'డయల్ యువర్ కమిషనర్'

రేపు 'డయల్ యువర్ కమిషనర్'

TPT: తిరుపతి నగరపాలక సంస్థలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునేవారు 0877-2227208 నంబర్‌కు కాల్ చేయవచ్చు. వినతిపత్రంతో పాటు ఆధార్ ప్రతిని జత చేసి, ఫోన్ నంబర్ ఇవ్వాలని సూచించారు.