VIDEO: రోడ్డు ప్రమాదం.. సీసీ ఫుటేజ్
SDPT: అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.