హిందూ సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణ
SDPT: చేర్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను అభయాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. కమిటీ అధ్యక్షుడు బాశెట్టి బుచ్చిరాములు ఆధ్వర్యంలో సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సమ్మేళనానికి ముఖ్య అతిథిగా అంబాత్రయక్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ హాజరవుతారని వెల్లడించారు. ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.