'రూ.18,500 వేతనం చెల్లించాలని వినతి'

VSP: తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు తమ సమస్యలపై శుక్రవారం కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. డ్రైవర్లకు రూ.8800 వేతనం అన్యాయమని పేర్కొన్నారు. అరబిందో సంస్థ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం రూ.18,500 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.