లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై
MHBD: ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, MHBD జిల్లా కోర్టులో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. కేసులు ఉన్న ప్రతి ఒక్కరు రాజీ మార్గాన్ని ఎంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 'రాజీమార్గమే రాజా మార్గం' అని పేర్కొన్నారు.