VIDEO: మండలంలో ఆందోళనలో వరి రైతాంగం.!
W.G: తుఫాన్ ప్రభావంతో ఆచంట మండల వ్యాప్తంగా చిరుజల్లులు మొదలయ్యాయి. వరి పంట కోసిన రైతులు తేమశాతం కోసం రహదారుల పక్కన ధాన్యాన్ని అరబోశారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు టార్పాలిన్లను కప్పి ఉంచారు. కొందరు రైతులు ధాన్యాన్ని ట్రాక్టర్లతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు.