ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి
KNR: గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసింది. దీంతో విద్యార్థుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. గతంలో అనేకమంది ఎమ్మెల్యేలు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చినా అవి నెరవేరలేదు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన హామీని నిలబెట్టుకుని, గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించారు.