నీటి తొట్టె పనులు ప్రారంభం

SKLM: లావేరు మండలంలోని నాగంపాలెంలో పశువుల నీటి తొట్టె పనులను గురువారం టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి పశువులకు నీటి సదుపాయం కోసం తొట్టెలను నిర్మించడం చాలా మంచి నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హైమావతి, ఫీల్డ్ అసిస్టెంట్ రామసత్యం నాయుడు ఉన్నారు.