VIDEO: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు
అన్నమయ్య: రాయచోటి మండలం గొర్లముదివేడు క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మేరకు కలకడ మండలం కదిరాయాన్ చెరువు గ్రామానికి చెందిన రెడ్డప్ప(60) గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రెడ్డప్పను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.