నేడు 228 బస్సులు నడిపాం:RM
HNK: RTC సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌తో పాటు ఇతర రూట్లలో ఇవాళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 228 బస్సులు నడిపినట్లు వరంగల్ RM భవాని ప్రసాద్ తెలిపారు. ఇందులో EV, అద్దె బస్సులు 224, సంస్థ బస్సులు 4 ఉన్నాయని చెప్పారు. ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.