జిల్లాకు మరో ఐదు డయాలసిస్ కేంద్రాల మంజూరు

జిల్లాకు మరో ఐదు డయాలసిస్ కేంద్రాల మంజూరు

ఆసిఫాబాద్ జిల్లాలో బాధితులకు డయాలసిస్ సేవలు చేరువకానున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రం, కాగజ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుతుండగా, తాజాగా జిల్లాకు మరో ఐదు మండలాల్లో డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైద్యసేవల కోసం గంటల తరబడి ప్రయాణం చేయడం, ఆర్ధిక భారం తప్పనున్నాయి.