'సరిపడా సచివాలయ సిబ్బందిని నియమించాలి'

'సరిపడా సచివాలయ సిబ్బందిని నియమించాలి'

ASR: కొయ్యూరు మండలంలో సరిపడా సచివాలయ సిబ్బందిని నియమించాలని ఎంపీపీ బడుగు రమేశ్ డిమాండ్ చేశారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన బదిలీల్లో, మండలం నుంచి ఎక్కువ మంది సిబ్బంది బదిలీపై వెళ్లారన్నారు. కానీ మండలానికి తక్కువ మంది సిబ్బంది వచ్చారన్నారు. దీంతో ప్రజలకు సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.