ఉత్కంఠ పోరు.. ఒక్క ఓటుతో విజయం
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కేవలం కొద్ది తేడాతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మద్దిరాల మండలం తూర్పు తండాలో ఎన్నికల కౌంటింగ్ రసవత్తంగా జరిగింది. BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. దీంతో గ్రామ BRS పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.