VIDEO: ఔటర్ రింగ్ రోడ్‌లో మృతదేహం లభ్యం
MDCL: కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఈ రోజు లభ్యం కావడం కలకలం రేపింది. మృతుడిని శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌కు చెందిన శ్యామ్‌గా గుర్తించారు. శ్యామ్ వృత్తిరీత్యా ఫంక్షన్‌లలో వంటలు చేస్తూ జీవనం సాగించేవాడు. ఎక్కడైనా చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అనే కోణంలో కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.