విమాన టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ: ఎయిరిండియా

విమాన టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ: ఎయిరిండియా

విమాన ఇంధనం ధర పెరిగిన నేపథ్యంలో ఈనెల 12 నుంచి దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ విధించనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. పశ్చిమాసియా విమాన టికెట్లపై 10 డాలర్లు, ఆఫ్రికా దేశాల టికెట్లపై 30-90 డాలర్ల చొప్పున సర్‌ఛార్జీ విధిస్తారు. ఆస్ట్రేలియా- అమెరికా టికెట్లపై 50 డాలర్లు పెరిగి 200 డాలర్లకు చేరనుంది.