'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన్న AO

KDP: రైతులు తాము పంటలు సాగు చేసుకునేటప్పుడు అధికారులను సంప్రదించాలని మండల ఏవో మారెడ్డి వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో 'పోలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు తగు సూచనలు చేశారు. రైతులు పంటల బీమా తప్పక చేయించుకోవాలన్నారు. అనంతరం సాగైన పత్తి పంటను పరిశీలించి, రైతులకు సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు.