'గాయపడ్డ సింహం: Vol 1.5'.. థీమ్ సాంగ్ రిలీజ్

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయపడ్డ సింహం: Vol 1.5'. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కనే ఒక యువకుడికి వీసా నిరాకరణ ఎదురైనప్పుడు.. అతడు ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది? అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.