'శ్రీశైలాన్ని నంద్యాల జిల్లాలోనే కొనసాగించాలి'
NDL: శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కేంద్రమని, దానిని నంద్యాల జిల్లాలోనే కొనసాగించాలని రాయలసీమ సాగునీటి పోరాట సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలాన్ని నంద్యాల నుంచి వేరు చేస్తే రాయలసీమ ఆత్మగౌరవానికి, అభివృద్ధి అవకాశాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.