VIDEO: నల్లబెల్లిలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు
WGL: నల్లబెల్లి మండలం మేడపల్లి, రాంపూర్ గ్రామాల సమీప అటవీ ప్రాంతం నుంచి సోమవారం ఉదయం వేలాది కోతులు తరలివచ్చాయి. వానర సైన్యం వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెడుతోంది. ఒకరిద్దరి పై దాడులు చేసినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, మహిళలు ఇళ్ల బయటకు రావడం మానేశారు. కోతుల బెడదను తక్షణం అరికట్టాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.