'ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలి'

ATP: గుత్తి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సీజనల్ వ్యాధులపై ప్రభుత్వ వైద్యులు, సచివాలయ సిబ్బందితో కమిషనర్ జబ్బర్ మియా సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడేగా పాటించాలని సూచించారు.