VIDEO: రోడ్లపై చెత్త డంప్.. రోజులుగా తొలగించని వైనం

RR: LBనగర్, మన్సూరాబాద్, BNరెడ్డి, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో కొందరు ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేస్తున్నారు. తడిపొడి చెత్తను వేరుచేసి ఆటోల్లో వేయాల్సి ఉండగా అలా చేయడం లేదు. ఖాళీ స్థలం, స్థానిక రోడ్లు, NH-65 వెంట డంప్ చేస్తున్నారు. అసలే వానకాలం కావడంతో దుర్వాసన వస్తుందని, డెంగ్యూ, మలేరియా సోకే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.