'దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు'

మన్యం: పార్వతీపురం మున్సిపాలిటీలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డులలో దోమలు వృద్ధి చెందకుండా నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ సీహెచ్. వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ మేరకు కాలువలలో పూడికలు తొలగించి నీరు నిల్వ లేకుండా చేస్తున్నట్లు, దోమలు వృద్ది చెందకుండా యాంటీ లార్వా స్ప్రే చేస్తున్నామన్నారు.