రోడ్డు భద్రతపై 'అరైవ్ అలైవ్': కలెక్టర్

రోడ్డు భద్రతపై 'అరైవ్ అలైవ్': కలెక్టర్

SRPT: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ నరసింహతో కలిసి 'అరైవ్ అలైవ్' కార్యక్రమంపై సమీక్షించారు. ఈనెల 13 నుంచి 18 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు.