ALERT: గడువు పొడిగింపు

AP: ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట ఏప్రిల్ 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాలని ప్రకటించి, తర్వాత మే 3వరకు పొడిగించింది. తాజాగా మే 5 వరకు ఆ గడువును పెంచింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.