మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తాం: ఎంపీ

KKD: కాకినాడ జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. తొండంగి మండలంలో మత్స్యకార గ్రామమైన ఎల్లయ్యపేటలో సామాజిక భవనానికి ఎంపీలాడ్స్ నిధులు రూ.40 లక్షలు కేటాయించిన సందర్భంగా మత్స్యకార సంఘాల నాయకులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.