తాండ సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

తాండ సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

MBNR: మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో మహమ్మద్ ఖాన్ పల్లిలో ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తాండాలో నెలకొన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.