వైద్య సిబ్బంది కొరతతో ప్రజల అవస్థలు
KRNL: ఆలూరు ప్రభుత్వ వైద్య శాలలో సిబ్బంది కొరత ఉందని రోగులు తెలిపారు. ముద్దనగేరికి చెందిన వృద్ధురాలు ఆనారోగ్యంతో ఆసుపత్రికి రాగా.. సరైన వైద్యం అందలేదని వృద్ధురాలి బంధువులు తెలిపారు. సరైన సమయంలో వైద్య సిబ్బంది లేకపోవడంతో సెలైన్ బాటిల్ పెట్టడానికి కూడా ఆలస్యమైందన్నారు. ఒకే నర్సు విధుల్లో ఉండటంతో రోగులకు సరైన సమయంలో సేవలు అందడం లేదని పెర్కొన్నారు.