ఆర్టీసీతో ఆధ్యాత్మిక యాత్ర: డీఎం
సూర్యాపేట డిపో నుంచి కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనకు ఈ నెల 23న ప్రత్యేక బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లు డీఎం సునీత తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. మంత్రాలయం, గోకర్ణ, మైసూర్ తదితర క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. భోజనం, వసతితో టికెట్ ధర రూ.9,300గా నిర్ణయించామని, ఆసక్తిగల వారు 9951613278 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.