తనకల్లు మండలంలో పంటలను పరిశీలించిన కలెక్టర్

సత్యసాయి: తనకల్ మండలంలో కీరదోసకాయ షెడ్‌నైట్ పంటను కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం పరిశీలించారు. రైతులు, ఉద్యానశాఖ అధికారులతో మాట్లాడి పంట వివరాలు తెలుసుకున్నారు. రైతులు పంటలను తరచూ పర్యవేక్షించి, ఆదాయం వచ్చే ఉద్యాన పంటలను విస్తృతంగా సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ నర్సయ్య పాల్గొన్నారు.